సారథిన్యూస్/ చొప్పదండి/ హుస్నాబాద్: హరితహారం ఓ మహాయజ్ఞమని ఈ కార్యక్రమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. బుధవారం ఆయన కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం వెదురుగట్టలో ఆరోవిడుత హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ మొక్కలను నాటడాన్ని తమవిధిగా భావించాలని పేర్కొన్నారు. అనంతరం జరిగిన ఓ కార్యక్రమంలో హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ తమ నియోజవర్గానికి నిధులు కేటాయించాలని మంత్రి కేటీఆర్‌ను కోరారు. దీనికి కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో మంత్రుల కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, కలెక్టర్ కే శశాంక, సీపీ కమలాసన్‌రెడ్డి, గ్రంథాలయసంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి, మేయర్ సునీల్‌రావు, ఎంపీపీ చిలుక రవీందర్, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.
- July 8, 2020
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- HARITHAHARAM
- KARIMNAGAR
- KCR
- KTR
- కేటీఆర్
- హరితహారం
- Comments Off on హరితహారం.. మహాయజ్ఞం