Breaking News

స్వీటీ స్పీడు మాములుగా లేదుగా..!

స్వీటీ అనుష్క సోషల్​మీడియాలో దూసుకుపోతున్నది. ఎప్పటికప్పడు ఫ్యాన్స్​తో విశేషాలను పంచుకుంటూ దూసుకుపోతున్నది. రీసెంట్​గా నిశ్భబ్దం చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ట్విట్టర్‌లో కూడా ఎంట్రీ ఇచ్చింది ఈ బొద్దుగుమ్మ. అయితే ఇన్​స్టాలో అనూష్కను ఫాలో అయ్యేవారి సంఖ్య 4 మిలియన్లకు చేరిందట. ఈ సందర్భంగా అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ ఓ పోస్ట్​ పెట్టింది స్వీటీ. ‘ధన్యవాదాలు.. ఎప్పుడూ నవ్వుతూ ఉండండి.. ప్రేమతో మీ అనుష్క’ అని ఆమె సంతకం చేసి ఉంది. ఆమె అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తూ.. శుభాకాంక్షలు తెలుపుతున్నారు.