శేఖర్ కమ్ముల డైరెక్షన్లో వస్తున్న ‘లవ్‌స్టోరీ’ చిత్రంలో తెలంగాణ అమ్మాయిగా కనిపించనున్న సాయిపల్లవి ‘విరాటపర్వం’ సినిమాలో నక్సలైట్‌గా నటిస్తోంది. ఒకదానికొకటి సంబంధం లేకుండా విభిన్న పాత్రల్లో నటించే సాయి పల్లవికి డ్యాన్సర్‌గా కూడా మంచి పేరు ఉంది. ‘ఫిదా’ సినిమాలో ‘మెల్లా మెల్లగ వచ్చిండే’ అన్న పాటకు ఒక రేంజ్లో వేసిన పల్లవి స్టెప్పులకు ప్రేక్షకులంతా ఫిదా అయిపోయారు. ‘సింగిల్ పీస్’ అంటూ భానుమతిగా ఫ్యాన్స్ పిలుచుకునే ఈ హైబ్రిడ్ పిల్లకు శేఖర్ ఇంకో ఆఫర్ ఇచ్చాడట. ‘లవ్ స్టోరీ’ సినిమా లో షూట్ చేయాల్సినవి ఇంకొన్ని సీన్లే ఉన్నాయట. వాటిలో సాంగ్ ఒకటి బ్యాలెన్స్ ఉందట. ఈ పాటకు డ్యాన్స్ కంపోజ్ చెయ్యమని పల్లవిని కోరాడట శేఖర్. అయితే ఈ పాటలో పల్లవి కూడా స్టెప్పులెయ్యాలి. తన పాటకు తనే కంపోజ్ చేసుకోవడం అన్న విషయం అభినందించదగ్గదే. దానికి సాయి పల్లవి కూడా ఒప్పుకుందని సమాచారం. దీంతో డ్యాన్స్ తో అలరించే పల్లవి కొరియోగ్రాఫర్‌గా కూడా రాణించనుందేమో అంటున్నారు.
- July 13, 2020
- Archive
- సినిమా
- COMPOSE
- DANCE
- SAIPALLAVI
- ఫిదా
- శేఖర్‌కమ్ముల
- సాయిపల్లవి
- Comments Off on స్వయంగా కంపోజ్