సారథి న్యూస్, చిన్నశంకరంపేట: కరోనా నేపథ్యంలో మూతబడిన స్కూళ్లను తగిన జాగ్రత్తలు పాటిస్తూ పునఃప్రారంభించాలని టీఎస్ యూటీఎఫ్ మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలాధ్యక్షుడు గిరిబాబు కోరారు. సోమవారం ఆయన ఎంపీడీవో గణేష్ రెడ్డి చేతుల మీదుగా టీఎస్ యూటీఎఫ్ క్యాలెండర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆలస్యం చేయకుండా ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియ ద్వారా విద్యావ్యవస్థను బలోపేతం చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి తిరుపతి, కాంప్లెక్స్ హెడ్మాస్టర్ ఫణింద్రచారి, ఉపాధ్యాయులు రామబ్రహ్మకుమార్, విఠోబా, స్వామి, ప్రవీణ్ కుమార్, శ్రీకాంత్, లక్ష్మణ్, నరేష్, సీఆర్పీ ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.
- January 11, 2021
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- CARONA
- CHINNASHANKARAMPET
- medak
- TELANGANA
- TSUTF
- కరోనా
- చిన్నశంకరంపేట
- టీఎస్‌యూటీఎఫ్
- తెలంగాణ
- మెదక్
- Comments Off on స్కూళ్లను త్వరగా ఓపెన్ చేయాలి