తెలుగు, తమిళ ప్రేక్షకులకు సుపరిచితుడైన సూర్య తన ప్రతి చిత్రాన్నీ రెండు భాషల్లో విడుదలయ్యేలా చూసుకుంటాడు. వెంకటేష్ తో ‘గురు’ సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ సుధా కొంగర ప్రస్తుతం సూర్యతో తమిళంలో ‘సూరరై పోట్రు’గా తెరకెక్కిస్తోంది. ఈ సినిమాను తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ టైటిల్ తో విడుదల చేస్తున్నారు. అపర్ణ బాలమురళీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో మోహన్ బాబు, జాకీష్రాఫ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సామాన్యుడికి సైతం విమాన సౌకర్యం అందించిన కెప్టెన్ గోపీనాథ్ జీవితాధారంగా ఈ చిత్రాన్ని 2డీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యనే స్వయంగా నిర్మిస్తున్నాడు. అన్ని పనులు పూర్తిచేసి ఏప్రిల్ నెలలోనే ఈ మూవీని రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ లాక్ డౌన్ కారణంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులకు బ్రేక్ పడింది. రీసెంట్ గా ప్రభుత్వం సినిమాల పోస్ట్ ప్రొడక్షన్ కు అనుమతి ఇవ్వడంతో.. చిత్రానికి సంబంధించి డబ్బింగ్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. తమిళ వెర్షన్ కు సూర్య డబ్బింగ్ చెప్పడం పూర్తికాగా.. తెలుగు వెర్షన్ కు మాత్రం నటుడు సత్యదేవ్ తో డబ్బింగ్ చెప్పిస్తున్నారట. సూర్య గత చిత్రాల్లో కొన్నింటికి తెలుగులో తనే డబ్బింగ్ చెప్పుకున్నాడు. కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కుదరకపోవడంతో సూర్య పాత్రకు సత్యదేవ్ తో డబ్బింగ్ చెప్పించాలనుకుంటున్నారట. సూర్య బాడీ లాంగ్వేజ్ కు సత్యదేవ్ వాయిస్ కు సరిగ్గా సరిపోతుందని చిత్రయూనిట్ భావిస్తోందట. ఆల్ రెడీ విడుదలైన ఈ మూవీ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేలా చేసింది.
- May 23, 2020
- Top News
- సినిమా
- GURU
- SATYADEV
- VENKATESH
- కెప్టెన్ గోపీనాథ్
- మోహన్ బాబు
- సత్యదేవ్
- Comments Off on సూర్యకు సత్యదేవ్ డబ్బింగ్