Breaking News

సూపర్ స్టార్ తో ఢీ..

సూపర్ స్టార్ తో ఢీ..


మహేశ్, పరశురామ్ కాంబినేషన్ లో మైత్రీ మూవీస్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్‌ ప్లస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. కీర్తి సురేష్ హీరోయిన్. అయితే ప్రజంట్ కరోనా ఉధృతి తగ్గకపోవడంతో షూటింగ్ పూర్తిగా మొదలవలేదు కాబట్టి మూవీ టీమ్ ఆర్టిస్ట్​లను ఎన్నుకునే పనిలో పడిందట. అయితే మహేష్ కు దీటుగా సత్తా ఉన్న విలన్ కావాలి కనుక ముందుగా విలన్ గురించే వేట మొదలైంది. ఉపేంద్ర, సుదీప్, అరవింద్ స్వామి ఇంకా కొందరు బాలీవుడ్ నటులను పరిశీలించారు. ఫైనల్​గా మాత్రం అరవింద స్వామినే ఎంపిక చేసినట్టు సమాచారం.

ఒకప్పుడు హీరో.. ఇప్పుడు హీరోలకు సరిపడా ఛామ్ ఉంది అరవింద్ కి. ఆల్​రెడీ రామ్ చరణ్ ‘ధృవ’ చిత్రంలో స్టైలిష్ విలన్​ కనిపించి మెప్పించాడు కూడా. అందుకే ఆ రోల్ కు అరవింద్ అయితే కరెక్ట్​గా సూటవుతాడని మేకర్స్ అభిప్రాయపడుతున్నారట. అందులోనూ మహేష్ ఈ మూవీలో ఎన్నారై పాత్రలో కనిపించనున్నాడని ఇప్పటికే విడుదల చేసిన లుక్ బట్టి అర్థమైపోయింది. అందుకే అరవింద్​ను సెలెక్ట్ చేసినట్టు టాక్. షూటింగ్ చాలా వరకూ యూఎస్​లోనే జరగనుందట. ఇక విలన్ కూడా కన్​ఫామ్​ అయితే షూటింగ్ షురూ అవుతుందన్నమాట.