Breaking News

సిక్స్​ల మోత.. రాజస్తాన్​ దే విజయం

సిక్స్​ల మోత.. రాజస్థాన్ దే విజయం

షార్జా: ఐపీఎల్​13వ సీజన్​లో భాగంగా చెన్నై సూపర్​కింగ్స్, రాజస్తాన్​ రాయల్స్​ జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. చివరికి రాజస్థాన్​ 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. చెన్నై సూపర్ ​కింగ్స్ ​తొలుత టాస్​గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్​కు దిగిన రాజస్తాన్​​ రాయల్స్ ​జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. రాజస్తాన్​ ఇన్నింగ్స్‌లో మొత్తం 17 సిక్స్‌లు బాదారు. సంజూ శాంసన్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌కు తెరతీశాడు. చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించాడు. 32 బంతుల్లో 1 ఫోర్‌, 9 సిక్స్‌లతో 74 పరుగులు సాధించాడు. కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ 69(47 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) చేశాడు. చివరిలో వచ్చిన జోఫ్రా ఆర్చర్‌ 8 బంతుల్లో వరుసగా 4 సిక్స్‌లతో 27 పరుగులతో స్కోరు బోర్డును పరుగెత్తించాడు. చెన్నై సూపర్​ కింగ్స్​ బౌలర్లలో సామ్‌ కరాన్‌ 3 వికెట్లు, ఎన్‌గిడి, చావ్లా, దీపక్‌ చాహర్‌ ఒక్కో వికెట్​ చొప్పున తీశారు.


అనంతరం బ్యాటింగ్​కు దిగిన చెన్నై సూపర్​ కింగ్స్​లో మురళీ విజయ్​ 21(21బంతుల్లో), వాట్సన్​ 33 (21), డుప్లిసెస్​ 72(37 బంతుల్లో ఏడు సిక్స్​లు, ఒక ఫోర్) పరుగులతో చెలరేగి ఆడాడు. ఎస్​ఎం కరణ్ ​17, కేఎం జాదవ్ ​22 (16 బంతుల్లో 3 ఫోర్లు), ఎంఎస్ ​ధోనీ 29 (నాటౌట్, హ్యాట్రిక్​ సిక్స్​లు), జడేజా 1 (నాటౌట్) చొప్పున 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 200 పరుగులు మాత్రమే చేయగలిగారు. రాజస్తాన్​​ రాయల్స్​బౌలర్లు ఆర్​ తేవాతియాకు 3, టీకే కరన్​, ఎస్​గోపాల్, జేసీ అర్చర్, జేడీ ఉనద్కత్​కు ఒక్కో వికెట్ ​దక్కాయి. సీఎస్​కే స్కోరు 200 పరుగుల వద్దే ఆగిపోయింది. దీంతో 16 పరుగుల తేడాతో రాజస్తాన్​​ రాయల్స్​ జట్టు విజయం సాధించింది.