ఢిల్లీ: రాజస్థాన్ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. సచిన్ పైలట్ వర్గంపై ఈనెల 24 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ రాజస్థాన్ హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో హైకోర్టు నిర్ణయాన్ని సవాలుచేస్తూ స్పీకర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై గురువారం విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం రాజస్థాన్ హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వలేమని తేల్చిచెప్పింది. దీంతో సచిన్ పైలట్ వర్గానికి మరోసారి ఊరట లభించింది. స్పీకర్ లేవనెత్తిన అంశాలపై సుధీర్ఘ విచారణ చేపడతామని చెప్పింది. తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. రాజస్థాన్ స్పీకర్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. స్పీకర్ విచక్షణాధికారాలపై కోర్టు జోక్యం చేసుకోరాదని పేర్కొన్నారు. ఆయన వాదనలు విన్న జస్టిస్ అరుణ్ మిశ్రా ధర్మాసనం ఈ అంశంపై సుధీర్ఘ విచారణ చేపడతామని చెప్పింది.
- July 23, 2020
- Archive
- Top News
- జాతీయం
- RAJASTHAN
- SACHIN
- SPEAKER
- SUPRIMCOURT
- రాజకీయాలు
- సచిన్
- Comments Off on సచిన్పైలట్కు ఊరట