సారథి న్యూస్, గజ్వేల్: సిద్దిపేట జిల్లా ములుగు మండలం నాగిరెడ్డిపల్లి గ్రామశివారులో సగం కాలిపోయిన గుర్తుతెలియని డెడ్‌బాడీని స్థానికులు బుధవారం గుర్తించారు. నాగిరెడ్డిపల్లిలోని పెద్దచెరువు సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించినట్లు ఎస్సై రాజేంద్రప్రసాద్ తెలిపారు. గుర్తుతెలియని దుండగులు హత్యచేసి మృతదేహాన్ని కాల్చివేసినట్లు భావించి ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. మృతుడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని, ఆచూకీ తెలిసిన వారు ములుగు పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. డెడ్‌బాడీని గజ్వేల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసులు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.