సారథి న్యూస్, వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలంలో సోమవారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించినట్లు తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి దబ్బకట్ల లక్ష్మయ్య తెలిపారు. కరోనా సమయంలో కూడా పండుగను ఐక్యంగా జరుపుకోవడం శుభపరిణామమని అన్నారు. మండలంలో వాజేడు, పేనుగోల్ కాలనీ, మండపాక, గణపురం, గుమ్మడిదొడ్డి, చీపురుపల్లి, చెరుకూరు, పేరూరు, కృష్ణాపురం, కొంగాల, ముత్తారం, శ్రీరామ్ నగర్ గ్రామాల్లో జెండాలు ఎగరవేశామని తెలిపారు. ఆదివాసి అమరవీరుల త్యాగాలు, పోరాట ఫలితంగా ప్రపంచంలోని ఐక్యరాజ్యసమితి ఆదివాసులకు ఆగస్టు 9ను పండుగ రోజుగా ప్రకటించిందన్నారు. కార్యక్రమంలో పేరూరు సర్పంచ్ సరస్వతి, చింతూరు సర్పంచ్ బుల్లెశ్వరరావు, ఆదివాసీ సంఘాల నాయకులు ఎట్టి రాజాబాబు, బోదెబోయిన సురేష్, యాలం సుబ్బయ్య, బచ్చల కృష్ణబాబు, నల్లె బోయిన సర్వేశ్వరరావు, నల్లెబోయినా పాపారావు, నల్లెబోయినా రమేష్, బడే షణ్ముఖ రావు, తోలం, జగన్ మోహన్ రావు, తోలం. కృష్ణారావు, టింగ బుచ్చయ్య పాల్గొన్నారు.
- August 10, 2020
- Archive
- లోకల్ న్యూస్
- వరంగల్
- AADIVASI
- MULUGU
- VAJEDU
- WARANGAL
- అడవిబిడ్డలు
- ములుగు
- వాజేడు
- Comments Off on సంబురంగా ఆదివాసీ దినోత్సవం