డార్లింగ్ ప్రభాస్ ‘బాహుబలి’ తర్వాత ప్యాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. ఇప్పుడాయన చేతిలో నాలుగు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో మొదటిది ‘రాధేశ్యామ్’. ఈ మూవీ షూటింగ్ లాస్ట్ స్టేజ్ లో ఉంది. మిగతా మూడు చిత్రాల్లో ఏ సినిమా ముందుగా సెట్స్ కు వెళ్తుంది. ఏ సినిమా ఫస్ట్ రిలీజ్ అవుతుందనే విషయాలపై చాలా డౌట్స్ ఉన్నాయి. జనవరిలో ‘ఆదిపురుష్’ షూటింగ్ స్టార్ట్ అవుతుందని ఓంరౌత్, ‘సాలార్’ కూడా జనవరిలోనే సెట్స్ కు వెళ్తుందని హోంబలే ఫిలింస్ క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ రెండు సినిమాల కంటే ముందుగా ప్రభాస్ తో నాగ్ అశ్విన్ మూవీని అనౌన్స్ చేశారు అశ్వనీదత్. భారీ బడ్జెట్ లో రూపొందబోతున్న ఈ సైన్స్ ఫిక్షన్ మూవీలో హీరోయిన్ గా దీపిక, కీలకమైన పాత్రలో అమితాబ్ బచ్చన్ నటించబోతున్నారు. ప్రభాస్ కోసం ఓ వైపు బాలీవుడ్ మేకర్స్, మరోవైపు కన్నడ ఫిల్మ్ మేకర్స్ పోటీపడుతున్న క్రమంలో తెలుగు డైరెక్టర్ నాగ్ అశ్విన్ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందనేది ఆసక్తికరంగా మారింది. తాజాగా తన సినిమా అప్ డేట్ విషయంలో కొంత క్లారిటీ ఇచ్చాడు నాగ్ అశ్విన్. ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు రిప్లై ఇస్తూ ‘పొంగల్ తర్వాత అప్ డేట్ ఇస్తా. వర్క్ ఫుల్ ఫ్లోలో నడుస్తోంది’ అంటూ నాగ్ అశ్విన్ ట్వీట్ చేశాడు. దీంతో సంక్రాంతికి ఈ మూవీ విషయంలో ఓ క్లారిటీ రానుందనే విషయం అర్థమవుతోంది.
- December 28, 2020
- Archive
- Top News
- సినిమా
- ADIPURUSH
- BAHUBALI
- DARLING
- OMROUTH
- PRABHASA
- ఆదిపురుష్
- ఓం రౌత్
- డార్లింగ్
- ప్రభాస్
- బాహుబలి
- Comments Off on సంక్రాంతి తర్వాతే..