- బీజేపీ ఎమ్మెల్యేలతో పరిచయం ఉంది
- వికాస్దుబే పాత ఇంటర్వ్యూ వీడియోలు వైరల్
- ఖండించిన బీజేపీ ఎమ్మెల్యేలు
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లో 8 మంది పోలీసుల హత్య కేసుతో పాటు మరో 60 కేసుల్లో నిందితుడై తప్పించుకు తిరుగుతున్న వికాస్ దుబే గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియోలు వైరల్ అవుతున్నాయి. తనకు పొటిలికల్‌గా పరిచయాలు ఉన్నాయని, యూపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ హరికృష్ణ శ్రీవాస్తవ తనకు పొలిటికల్ గురువు అని ఆయన ఆ వీడియోలో చెప్పారు.
యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ టర్మ్‌లో శ్రీవాస్తవ 1990–91 వరకు స్పీకర్‌గా వ్యవహరించారు. తనకు క్రిమినల్స్, కేసులు, క్రైంతో ఎలాంటి సంబంధాలు లేవని తన ఎదుగుదలను చూసి ఓర్వలేకే శత్రువులు తనపై అక్రమంగా కేసులుపెట్టాడని వికాస్ ఆ వీడియోలో చెప్పారు. అంతే కాకుండా తనకు బీజేపీ ఎమ్మెల్యేలు అభిజిత్ సంగా, భగతి సాగర్‌తో కూడా పరిచయాలు ఉన్నాయని, ఆ ఇద్దరు లీడర్లు 2017లో తనకు హెల్ప్ కూడా చేశారని చెప్పిన మరో వీడియో కూడా బయటికి వచ్చింది.
ఆ వీడియోల అంశంపై ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు స్పందించారు. తమకు వికాస్‌తో ఎలాంటి సంబంధాలు లేవని అన్నారు.‘నాది కాన్పూర్‌లోని భీతూర్ నియోజకవర్గం. పక్కనగ్రామాల వాళ్లు నా దగ్గరికి హెల్ప్కోసం వస్తుంటారు. నిజానికి దుబేపై చర్యలు తీసుకోవాలని నేను చాలాసార్లు చెప్పాను, ఆయనకు వేరే పొలిటికల్ పార్టీల సపోర్ట్ ఉందని నాకు తెలుసు’ అని అభిజిత్ సంగా అన్నారు. తనకు ఉన్న మంచిపేరును చెడగొట్టేందుకు కావాలనే తనపై ఆరోపణలు చేస్తున్నారని భగవతి సాగర్ అన్నారు. సదరు వీడియోలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.