ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల ఇంట్లో విషాదం చోటుచేసుకున్నది. ఆయన తండ్రి శేషయ్య శనివారం కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడతున్నట్టు సమాచారం. ఈ రోజు సాయంత్రం సికింద్రాబాద్ బన్సీలాల్ శ్మశానవాటికలో శేషయ్యకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పలువురు సినీ ప్రముఖులు శేఖర్ కమ్ములకు ఫోన్ చేసి సంతాపం తెలిపారు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల నాగచైతన్య, సాయిపల్లవి హీరో హీరోయిన్లుగా ‘లవ్‌స్టోరీ’ అనే సినిమా తీస్తున్నాడు. సినిమా షూటింగ్ పూర్తయినప్పటికీ కరోనా లాక్‌డౌన్‌తో ఈ సినిమా విడుదలకు నోచుకోలేదు.
- August 1, 2020
- Archive
- Top News
- సినిమా
- FATHER
- PASSAWAY
- SHEKAR KAMMULA
- అనారోగ్యం
- శేఖర్ కమ్ముల
- Comments Off on శేఖర్ కమ్ముల ఇంట విషాదం