బిగ్‌బాస్- 4 హౌస్ నుంచి ఫస్ట్ బయటకు వెళ్లేది తమిళదర్శకుడు సూర్యకిరణే అని సమాచారం. ఎలిమినేషన్‌కు నామినేట్ అయిన వాళ్లలో అతి తక్కువ మార్కులు ఉండటంతో బిగ్‌బాస్ ఈ నిర్ణయం తీసుకున్నారట. ఈ సారి బిగ్‌బాస్‌లో చాలా మంది కొత్తమొఖాలు కావడంతో ప్రేక్షకులు కూడా చాలా బోర్‌గా ఫీలవుతున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో వచ్చేవారం ఇద్దరు కమెడియన్లు హౌస్‌లోకి వైల్డ్‌కార్డు ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. హౌస్‌లో చాలామందికి తెలుగు మాట్లాడకపోవడంతో ప్రేక్షకులు చాలా ఇబ్బందిపడుతున్నారట. ప్లాప్ అయిన తమిళ డబ్బింగ్ సినిమాను బలవంతంగా చూస్తున్నట్టు కొందరు ప్రేక్షకులు సోషల్‌మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఇక బిగ్‌బాస్ ప్రారంభమైనప్పటి నుంచి మేమ్స్ ఓ రేంజ్లో వస్తున్నాయి.
సూర్యకిరణ్ వోటింగ్‌లో వెరీ పూర్..
సూర్య కిరణ్ బయటకు వెళ్లిపోతాడని లీక్‌లు వచ్చేశాయి. అయితే సూర్యకిరణ్ ఎందుకు ఎలిమినేట్ కాబోతున్నాడన్నవిషయం చర్చనీయాంశంగా మారింది. అనవసర విషయాల్లో దూరిపోయి లెక్చర్లు ఇవ్వడం, నోరు పారేసుకోవడంతో సూర్యకిరణ్ పట్ల ప్రేక్షకుల్లో నెగిటివ్ అభిప్రాయం ఏర్పడిందట. దీంతో సూర్యకిరణ్‌కు ఓటింగ్ పడలేదని సమాచారం. సూర్య కిరణ్.. తెలుగులో సత్యం, ధన 51, రాజుభాయ్ వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. హీరోయిన్ కళ్యాణిని పెళ్లి చేసుకుని కొంతకాలానికి విడాకులు తీసుకున్నాడు. ఈ వారం ఎలిమినేషన్ నామినేషన్లో గంగవ్వ, అభిజిత్, మెహబూబ్ దిల్సే, అఖిల్ సార్థక్, సూర్య కిరణ్, సుజాత, దివి వైద్య ఉన్నారు. గంగవ్వ, అభిజిత్, సుజాత ఇప్పటికే నామినేషన్ నుంచి తప్పించుకున్నారు.