సారథిన్యూస్, రామగుండం: ఓ రాజకీయనాయకుడి ఇంట్లో దర్జాగా పేకాట ఆడుతున్న ఓ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకొని వారినుంచి భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్‌లోని వైస్‌ఎంపీపీ ఇంట్లో కొందరు పేకాట ఆడుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆ ఇంటిపై దాడిచేసి 11 మంది పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ. లక్షా నలబైవేల నగదు, 11 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో పలువురు మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీలకు చెందిన ద్వితీయశ్రేణి నాయకులు ఉన్నట్టు సమాచారం. ఈ దాడిలో రామగుండం టాస్క్ ఫోర్స్ సీఐ రాజ్‌కుమార్, ఎస్సై మస్తాన్ సిబ్బంది పాల్గొన్నారు.
- July 8, 2020
- Archive
- కరీంనగర్
- క్రైమ్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- CARDS
- GANG
- POLICE
- RIDE
- VICE MPP
- పోలీసులు
- ముఠా
- Comments Off on వైస్ ఎంపీపీ ఇంట్లోనే పేకాట