సారథి న్యూస్, రామాయంపేట: రెండు వేర్వేరు ప్రమాదాల్లో గాయపడి చికిత్స పొందుతూ నిజాంపేట మండలానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మంగళవారం మృతిచెందారు. మండలంలోని కల్వకుంట గ్రామానికి చెందిన రంగ పోచయ్య(63) రెండు రోజుల క్రితం మామిడి పండ్లు తెంచే క్రమంలో చెట్టు పైనుంచి కాలుజారి కింద పడి.. చికిత్స పొందుతూ చనిపోయాడు. చల్మేడ గ్రామానికి చెందిన రాగుల పర్శరాములు(36) గత బుధవారం కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. చికిత్సపొందుతూ పరిస్థితి విషమించడంతో చనిపోయాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
- May 19, 2020
- క్రైమ్
- షార్ట్ న్యూస్
- ACCIDENT
- RAMAYAMPET
- చికిత్స
- నిజాంపేట
- బీబీపేట
- రోడ్డు ప్రమాదం
- Comments Off on వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి మృతి