హైదరాబాద్: ప్రస్తుతం ఉన్న వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మార్పులు తెచ్చే విషయంపై కేంద్ర ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. ఇందుకు సంబంధించి తాజా సమాచారం ప్రకారం వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా ఫారం-20 నిబంధనల్లో సవరణలు చేయడం ద్వారా ఓనర్షిప్నకు సంబంధించి కచ్చితమైన విధానం అమల్లోకి తీసుకురావాలని యోచిస్తోంది. సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్ 1989లోని ఫారం-20లో చేయాల్సిన మార్పులు, చేర్పులపై సలహాలు సూచనలు అందజేయాలని సంబంధిత శాఖలను కోరుతూ ఆగస్టు 18న నోటిఫికేషన్ కూడా విడుదల చేసినట్లు తెలుస్తోంది. వాహనాలకు సంబంధించి ఓనర్షిప్ కచ్చితంగా తెలుసుకునేందుకు వీలుగా ఈ ఫారం– 20లో అవసరమైన మార్పులు చేయనున్నట్లు కేంద్ర రవాణా మంత్రిత్వశాఖ పేర్కొంది.
- August 22, 2020
- Archive
- Top News
- జాతీయం
- OWENERSHIP
- REGISTRATION
- VEHICLE
- ఓనర్షిప్
- వెహికిల్ రిజిస్ట్రేషన్
- Comments Off on వెహికిల్ ఓనర్షిప్పై కచ్చితమైన విధానం