లండన్: విరాట్, రోహిత్‌ను మామూలుగా ఔట్ చేయడమే కష్టం. అలాంటిది వీళ్లిద్దరూ క్రీజులో కుదురుకుంటే ఓ రేంజ్లో బౌలర్లను చితక్కొడుతుంటే వికెట్ తీయడమంటే బౌలర్లు, కెప్టెన్‌కు శక్తికి మించిన పనే. ఇలాంటి సందర్భమే ఆసీస్ కెప్టెన్ ఫించ్‌కు ఎదురైందంటా. అప్పుడు ఫించ్ ఏకంగా అంపైర్‌నే సలహా అడిగాడంట. ఈ విషయాన్ని అప్పటి మ్యాచ్‌లో అంపైర్‌గా చేసిన మైకేల్ గాఫ్ స్వయంగా వివరించాడు.
‘అది భారత్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్. రోహిత్, కోహ్లీ అప్పటికే భారీ భాగస్వామ్యం దిశగా వెళ్తున్నారు. వీళ్లను ఔట్ చేయడానికి ఫించ్ అందుబాటులో ఉన్న అని ప్రయోగాలు చేశాడు. కానీ ఔట్ చేయలేకపోయారు. నేను స్క్వేర్ లెగ్ వద్ద నిల్చున్నప్పుడు నా పక్కనే ఫీల్డింగ్ చేస్తున్నాడు. మెల్లగా నా వద్దకు వచ్చి.. వీళ్లు ఇలా ఆడటం చూడలేకపోతున్నా. ఎలా ఔట్చేయాలో చెప్పని అడిగాడు. నాకు అప్పజెప్పిన పని చాలా ఉంది. నా పని నేను చూసుకుంటా. నీ పని నువ్వు చూసుకో అని చెప్పా’ అని గాఫ్ పేర్కొన్నాడు.