సారథి న్యూస్, రామాయంపేట: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని గొప్పలు చెప్పిన సీఎం కేసీఆర్ మాట తప్పారని, ప్రభుత్వ నియంతృత్వ పోకడలకు రోజులు దగ్గరపడ్డాయని మెదక్ జిల్లా నిజాంపేట బీజేపీ మండలాధ్యక్షుడు చంద్రశేఖర్ అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా గురువారం నిజాంపేట మండలకేంద్రంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ కోసం బలిదానం చేసుకున్న తెలంగాణ అమరవీరులను స్మరించుకోవడం సంతోషంగా ఉందన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే విమోచన ధినాన్ని అధికారికంగా నిర్వహిస్తామని ఆయన స్పష్టంచేశారు. అనంతరం ప్రధాని నరేంద్రమోడీ జన్మదినం పురస్కరించుకుని గుడిలో ప్రత్యేకపూజలు చేశారు. కార్యక్రమంలో నాయకులు రాజిరెడ్డి, శేఖర్, శ్రీకాంత్, ప్రశాంత్, లక్ష్మణ్ చంద్రశేఖర్, మహేష్, సంతోష్, ప్రమోద్, అంజయ్య, సత్యనారాయణ పాల్గొన్నారు.
- September 17, 2020
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- BJP
- NIZAMPET
- PM MODI
- TELANGANA VIMOHANAM
- తెలంగాణ విమోచనం
- నిజాంపేట
- ప్రధాని మోడీ
- బీజేపీ
- Comments Off on విమోచనంపై సీఎం మాట తప్పిన్రు