సారథి న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం: ఓపెన్ యూనివర్సిటీ ఎగ్జామ్స్ నిర్వహణ అభాసుపాలవుతోంది. నిర్వాహకులు బుక్స్, సెలఫోన్స్ ముందుపెట్టుకుని ఎగ్జామ్స్ రాయించడం చర్చనీయాంశంగా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని రవి ఐటీఐ కాలేజీలో నాగార్జున యూనివర్సిటీ ఓపెన్ డిస్టెన్స్ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు. ఇక్కడ జోరుగా మాస్ కాపీయింగ్ కొనసాగుతోంది. కోవిడ్ 19 నిబంధనలు పాటించకుండా ఒకే రూమ్ లో 40 మందిని కిక్కిరిసి కూర్చోబెట్టి పరీక్ష రాయిస్తున్నారు. నిర్వాహకులు విద్యార్థుల వద్ద ఒక్కో సబ్జెక్ట్ కు కొంత వసూలు చేసి చూసిరాసేలా ప్రోత్సహిస్తున్నారు. ఇంత జరుగుతున్నా పర్యవేక్షించాల్సిన అధికారులు మాత్రం నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్టూడెంట్స్ యూనియన్ సంఘాలు డిమాండ్ చేస్తున్నారు.
- November 1, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- BADRADRIKOTHAGUDEM
- MASSCOPIENG
- NAGARJUNA UNIVERSITY
- PALVANCHA
- ఓపెన్‌యూనివర్సిటీ
- నాగార్జున యూనివర్సిటీ
- భద్రాద్రి కొత్తగూడెం
- మాస్‌కాపీయింగ్
- Comments Off on వారెవ్వా.. కాపీయింగ్