న్యూఢిల్లీ: ఈ ఏడాది భారత్‌లో ఐపీఎల్ జరిగే అవకాశాలు చాలా స్వల్పంగా ఉన్నాయని మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అన్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో లీగ్‌ను నిర్వహించడం పెద్ద తలనొప్పితో కూడుకున్న వ్యవహారమన్నాడు. అయితే సెప్టెంబర్‌లో శ్రీలంక లేదా యూఏఈలో మెగా టోర్నీని నిర్వహించేందుకు అనుకూలంగా ఉంటుందన్నాడు. ‘స్టేడియాల్లోకి అభిమానులను అనుమతిస్తూ ఆసీస్ నిర్ణయం తీసుకోవడంతో టీ20 ప్రపంచకప్‌పై ఆశలు మొలకెత్తుతున్నాయి. అక్టోబర్‌లో ఈ మెగా ఈవెంట్ ఉంటే అంతకంటే ముందుగానే అన్ని జట్లు అక్కడికి వెళ్తాయి. క్వారంటైన్, ఇతరత్రా అన్ని పూర్తి చేసుకుని టోర్నీకి సిద్ధమవుతారు. కాబట్టి ప్రపంచకప్‌పై ఐసీసీ ముందడుగు వేస్తే ఐపీఎల్ జరగడం అసాధ్యం. ఇక సెప్టెంబర్‌లో భారత్‌లో వర్షకాలం. మ్యాచ్‌లు సాధ్యం కాదు. కాబట్టి లంక, యూఏఈలో ఒకదానిని ఎంచుకోవచ్చు. కాకపోతే మ్యాచ్‌ల సంఖ్య తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి’ అని గవాస్కర్ వివరించాడు.
- June 14, 2020
- Archive
- Top News
- క్రీడలు
- GAVASKAR
- IPL
- SRILANKA
- యూఏఈ
- శ్రీలంక
- సునీల్ గవాస్కర్
- Comments Off on లంక లేదా యూఏఈలో ఐపీఎల్