సారథిన్యూస్, ఖమ్మం: తెలంగాణ రాష్ట్రంలో నిర్మిస్తున్న రైతు వేదికలు దేశానికే తలమానికమని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం ముదిగొండ గ్రామంలో రూ.22 లక్షలతో నిర్మించనున్న రైతు బంధు వేదిక నిర్మాణ పనులకు సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతాంగాన్ని సంఘటితం చేసేందుకు, వారికి ఆధునిక వ్యవసాయంపై అవగాహన కల్పించేందుకే సీఎం కేసీఆర్ రైతువేదికలకు శ్రీకారం చుట్టారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, జిల్లా వ్యవసాయ అధికారి విజయనిర్మల తదితరులు పాల్గొన్నారు.
- July 13, 2020
- Archive
- ఖమ్మం
- AJAY
- KAMMAM
- KCR
- MADHIRA
- MINISTER
- TRS
- పువ్వాడ అజయ్
- రైతు వేదికలు
- Comments Off on రైతు వేదికలు దేశానికే తలమానికం