కమర్షియల్ డైరెక్టర్ సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ మ్యూజికల్ హిట్ ను సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా దేవిశ్రీ ఐటెమ్ సాంగ్స్ కు మాంచి క్రేజీ ఉండేది. ప్రస్తుతం స్టైలిష్ స్టార్ బన్నీతో సుకుమార్ ‘పుష్ప’ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు దేవిశ్రీప్రసాదే బ్యాక్ డ్రాప్ ఇస్తున్నాడు. ఇప్పటికే పుష్ప కోసం దాదాపు అన్ని ట్యూన్స్ ను రెండు మూడు వర్షన్లుగా రెడీచేసి పెట్టాడట. త్వరలోనే ఫైనల్ చేస్తారని తెలుస్తోంది.. అయితే ఈ మూవీలో స్పెషల్ సాంగ్ విషయంలో దేవిశ్రీ చాలా పట్టుదలతో ఉన్నాడట. ఇటీవల కాలంలో తన బాణీల వేడి తగ్గుతుందనే విమర్శలు ఎదుర్కొంటున్నాడు దేవిశ్రీ. ఈ సినిమాతో ఆ విమర్శలకు సమాధానం ఇవ్వాలనుకుంటున్నాడట. అందుకే బన్నీతో గతంలో చేసిన ‘ఆ అంటే అమలాపురం.. రింగ రింగల’ రేంజ్ లో ఐటెం సాంగ్ ను రెడీ చేశాడట. దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్ చేసిన రింగ రింగ ట్యూన్ ను హిందీ, తమిళంలో కూడా వాడుకున్న విషయం తెల్సిందే. అంతగా సక్సెస్ అయిన రింగ రింగ ఇప్పుడు కూడా జనాల చేత స్టెప్పులేయిస్తోంది. ఈ సమయంలో పుష్ప కోసం అలాంటి నెంబర్ స్పెషల్ సాంగ్‌ను ఇవ్వాలని దేవిశ్రీ కృతనిశ్చయంతో ఉన్నాడట. అందుకే చాలా సమయం కేటాయించి సాంగ్ ఒకటి ట్యూన్ చేశాడట. ఆడియన్స్‌ను ఎంతగా ఊర్రూతలూగించనుందో పాట బయటకొస్తేనే కానీ విషయం తెలీదు మరి.
- September 3, 2020
- Archive
- Top News
- సినిమా
- ALLUARJUN
- DEVISRIPRASAD
- PUSHPA
- STYLESH STAR
- అల్లు అర్జున్
- దేవిశ్రీప్రసాద్
- రింగ రింగ.. రింగారే
- సుకుమార్
- Comments Off on రింగ..రింగ.. రింగారే..