Breaking News

రాజశేఖర్​రెడ్డికి డాక్టరేట్​

సారథి న్యూస్, రామాయంపేట: మూడు దశాబ్ధాలుగా లయన్స్​ క్లబ్​, రెడ్​ క్రాస్​, మానవతా సంస్థల ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్న రామాయంపేటకు చెందిన ఏలేటి రాజశేఖర్​రెడ్డికి న్యాయ శాస్త్రం లో డాక్టరేట్​ లభించింది. సామాజిక శాస్త్రంలో, న్యాయశాస్త్రంలో పట్టబద్రుడైన ఆయన హైదరాబాద్​లోని కేవీ రంగారెడ్డి కాలేజీ ప్రిన్సిపల్​ డాక్టర్​ జైపాల్​రెడ్డి, రాజస్థాన్​లోని జగదీశ్​ ప్రసాద్​ జబర్​ మెన్​ టెబ్రివాల యూనివర్సిటీ (జేజేటీయూ) అసిస్టెంట్​ ప్రొఫెసర్​ డాక్టర్​ విజయమాల పర్యవేక్షణలో ‘ఏ స్టడీ ఆన్​ ఎన్విరాన్​మెంటల్​ లాస్​ విత్​ రిఫరెన్స్​ టు ఎయిర్​ పొల్యూషన్​ ఇన్​ ఇండియా’ అనే అంశంపై పరిశోధన గ్రంథాన్ని సమర్పించారు. ఈ మేరకు జేజేటీయూ యూనివర్సిటీ ప్రసిడెంట్​ బాల్​కిషన్​ టబ్రివాల, రిజిస్ట్రార్​ మధుగుప్తాలు తనకు న్యాయశాస్ర్తంలో డాక్టరేట్​ ప్రధానం చేసినట్టు రాజశేఖర్​ రెడ్డి వివరించారు. ఆయనకు డాక్టరేట్​ లభించడం పట్ల కాకతీయ యూనివర్సిటీ మాజీ డీన్​ కేవీ రంగారావు, మెదక్​ మాజీ కలెక్టర్​ ధర్మారెడ్డి, రెడ్​క్రాస్​ సొసైటీ తెలంగాణ చైర్మన్​ దేశాయ్​ ప్రకాశ్​రెడ్డి, జనరల్​ సెక్రటరీ మధుమోహన్​ హర్షం వక్తం చేశారు.