సౌత్ లో అనుకున్న సక్సెస్ సాధించలేకపోయాననే ఫీల్ తో నార్త్ కు వెళ్లింది పంజాబీ సుందరి తాప్సీ పన్ను. నిజానికి తాప్సీ తెలుగులో స్టార్ హీరోలతో మంచి సినిమాలే చేసింది. అయినా సంతృప్తి లేకనో ఇంకా ఏదో సాధించాలనే పట్టుదలతో బాలీవుడ్ కు వెళ్లింది. నిజంగానే అక్కడ అనుకున్నది సాధించింది తాప్సీ. మన్మార్జియాన్, గేమ్ ఓవర్, సాండ్ కీ ఆంఖ్, తప్పడ్ వంటి డిఫరెంట్ కంటెంట్ లతో వచ్చిన మూవీస్తో తన టాలెంట్ ను నిరూపించుకుంది. ప్రజెంట్ అథ్లెట్ బయోపిక్ లో ప్రధాన పాత్రలో నటిస్తోంది తాప్సీ. ఆకాశ్ ఖురానా దర్శకత్వంలో ‘రష్మీ రాకెట్’ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న చిత్రంలో తాప్సీ అథ్లెట్ గా కనిపించనుంది. క్యారెక్టర్ మేకోవర్ కోసం ఎలాంటి రిస్క్ అయినా తీసుకునే తాప్సీ ఆ సినిమా కోసం చాలా శ్రమిస్తోంది. నవంబర్ నుంచి షూటింగ్ షురూ అయింది. తన ప్రతి మూవ్మెంట్ను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. ఇప్పుడు తాప్సీ రీసెంట్గా ‘ఇది చాలా కఠినమైంది’ అంటూ ఓ వీడియోను పోస్ట్ చేసింది. అందులో తాప్సీ తీస్తున్న పరుగులు చూస్తుంటే అథ్లెట్ గా మారేందుకు ఎంత కఠినమైన శిక్షణ తీసుకుందో అర్థమవుతోంది. ఆర్ఎస్వీపీ మూవీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.
- December 16, 2020
- Archive
- Top News
- సినిమా
- BOLLYWOOD
- GAMEOVER
- RASHMIROCKET
- SANDKIANK
- TAPSYPANNU
- గేమ్ ఓవర్
- తాప్సీ పన్ను
- బాలీవుడ్
- రష్మీ రాకెట్
- సాండ్ కీ ఆంఖ్
- Comments Off on రష్మీ వర్సెస్ తాప్సీ