సారథి న్యూస్, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండల తీర్మాలపూర్ కు చెందిన యువ రైతు శ్రీనివాస్ అంజీర్ పంటను సాగుచేసి లాభాలను పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న తెలంగాణ వ్యవసాయ, ఉద్యానవనశాఖ రైతుకు ప్రశంసాపత్రం అందజేసింది. బుధవారం రైతు శ్రీనివాస్‌కు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రశంసాపత్రం అందజేసి సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ కలిగేటి కవిత, డీఏవో శ్రీధర్, జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమశాఖ అధికారి శ్రీనివాస్, ఏడీఏ రామారావు పాల్గొన్నారు.
- August 26, 2020
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- AGRICULTURE
- ANJEER
- FARMER
- KARIMNAGAR
- కరీంనగర్
- రైతు
- వ్యవసాయం
- Comments Off on యువరైతుకు సన్మానం