న్యూఢిల్లీ: అనేక విషయాల్లో ప్రధానమంత్రి మోడీ ప్రభుత్వాన్ని నిత్యం టార్గెట్ చేస్తున్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. నరేంద్ర మోడీ మూడు అంశాల్లో ఫెయిల్ అయ్యారని, హార్వర్డ్ బిజినెస్ స్కూల్ స్టడీలో ఈ విషయం తేలిందని రాహుల్ గాంధీ అన్నారు. ‘ఫ్యూచర్ హెచ్‌బీఎస్ స్టడీస్ ఆన్ ఫెయిల్యూర్: 1. కొవిడ్ 19, 2,డీమానిటైజేషన్, 3. జీఎస్టీ అమలు’ అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. దాంతో పాటు మోడీ కరోనాపై మాట్లాడుతున్న వీడియోను కూడా పోస్ట్ చేశారు. రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ కరోనా విషయంపై మొదటి నుంచీ ప్రధాని మోడీని విమర్శిస్తూనే ఉన్నారు. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ విషయంలో కూడా మోడీ ప్రభుత్వం ఫెయిల్ అయిందంటూ విమర్శలు చేశారు.
- July 6, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- COVID19
- MODI
- RAHUL GANDHI
- కాంగ్రెస్
- మోడీ
- రాహుల్‌గాంధీ
- Comments Off on మోడీ ప్రభుత్వం మూడింటిలో ఫెయిల్