తన స్పిన్ మాయజాలంతో ప్రపంచ క్రికెట్ చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించుకున్న శ్రీలంక దిగ్జజ బౌలర్ ముత్తయ్య మురళీధరన్ జీవిత చరిత్ర ఆధారంగా ఓ సినిమా తెరకెక్కుతున్నది. తమిళనటుడు విజయ్ సేతుపతి ఈ చిత్రంలో మురళీధరన్ పాత్రను పోషించబోతున్నాడు. మురళీధరన్ బౌలింగ్ శైలి చాలా భిన్నంగా ఉంటుంది. అతడి బౌలింగ్ అంటే ప్రముఖ ఆటగాళ్లు సైతం వణికిపోతుంటారు. కీలకసమయంలో వికెట్లు పడగొట్టి జట్టును గట్టెంకించడం మురళీధరన్ ప్రత్యేకత. అలాంటి గొప్ప క్రికెటర్ జీవిత కథను సినిమా రూపంలో తెరకెక్కించబోతున్నారు. ఈ చిత్రానికి ‘800’ అనే టైటిల్‌ని నిర్ణయించినట్టు సమాచారం. మురళీధరన్ అంతర్జాతీయ క్రికెట్లో 800 వికెట్లు తీసిన వైనానికి సంకేతంగా దీనికి ఆ టైటిల్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. దార్ మోషన్ పిక్చర్స్, సురేశ్ ప్రొడక్షన్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
- August 20, 2020
- Archive
- సినిమా
- BIOPIC
- CRIKETER
- MOVIE
- MURALIDAR
- TAMIL
- VIJAYSETHUPATHI
- బయోపిక్
- మురళీధర్
- స్పిన్నర్
- Comments Off on మురళీధరన్‌గా విజయ్ సేతుపతి