- మరోసారి విజేతగా నిలిచిన రోహిత్ సేన
- ఫైనల్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమి
దుబాయ్: ముంబై ఇండియన్స్ మరోసారి ఐపీఎల్ చాంపియన్‌గా నిలిచింది.. వరుసగా ఐదోసారి విజేతగా కప్ గెలుచుకుంది. ఢిల్లీపై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి మరోసారి తనకు తిరుగులేదని నిరూపించుకుంది. ఐపీఎల్ 13 సీజన్ ఫైనల్ మ్యాచ్ చాలా కూల్‌గా సాగింది. ఢిల్లీ విసిరిన 157 పరుగుల టార్గెట్ ను ముంబై బ్యాట్స్‌మెన్స్ చాలా ఈజీగా ఛేదించారు. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. రిషభ్ పంత్(56; 38 బంతుల్లో 4×4, 6×2), శ్రేయస్ అయ్యర్(65 నాటౌట్; 50 బంతుల్లో 4×6, 6×2) రాణించారు. టాస్ గెలిచిన ఢిల్లీ ఇన్నింగ్స్‌ను ధావన్, స్టోయినిస్ తో ప్రారంభించింది. తొలి ఓవర్‌ను అందుకున్న బౌల్ట్.. తాను వేసిన తొలి బంతికే స్టోయినిస్‌ను పెవిలియన్‌కు పంపించాడు. అజింక్యా రహానే(2), శిఖర్ ధావన్(15), హెట్మెయిర్(5) వెనువెంటనే ఔటయ్యారు. అయితే ఢిల్లీ 22 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పరుగుల వేటలో కష్టాల్లో పడింది. ముంబై బౌలర్లలో బౌల్ట్ మూడు వికెట్లు సాధించగా కౌల్టర్ నైల్ రెండు వికెట్లు తీశాడు. జయంత్ యాదవ్‌కు ఒక వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ముంబై బ్యాట్స్మెన్లలో రోహిత్‌శర్మ (68, 51 బంతుల్లో 4×5, 6×4), డికాక్ (20, 12 బంతుల్లో 3×4, 6×1) మంచి ఆరంభం అందించారు. సూర్యకుమార్ యాదవ్ 19 పరుగులు చేసి సింగిల్ తీసే క్రమంలో రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్(33, 19 బంతుల్లో 4×3, 1×6) ధాటిగా ఆడి నాటౌట్‌గా నిలిచాడు. పొలార్డ్ 9, హార్ధిక్ పాండ్యా 3 పరుగుల ఔట్ అయ్యారు. ఒక పరుగుతో కృనాల్ పాండ్యా విన్నింగ్ షాట్ కొట్టాడు. 18.4 ఓవర్లలోనే ఐదు వికెట్ల నష్టానికి ఢిల్లీ 157 పరుగులు చేసింది. ఇక ఢిల్లీ బౌలర్లలో నార్త్జే రెండు, రబడ, స్టోయినిస్ ఒక్కో వికెట్ చొప్పున తీశారు. కాగా, ముంబై ఇండియన్స్ 2013,2015,2017,2019,2020 సీజన్లలో చాంపియన్‌గా నిలిచింది.