సారథి న్యూస్, హైదరాబాద్: రైతన్నలను ఆదుకోవాలనే సంకల్పంతో ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం ‘ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్నిధి యోజనా’ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా సంవత్సరానికి రూ.ఆరువేలు అందిస్తోంది. ఈ దఫా రైతులకు రూ.2,000 చొప్పున చెల్లించనుంది. కేంద్ర ప్రభుత్వ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్(డీబీటీ) ద్వారా రైతుల బ్యాంకు ఖాతాలోకి జమచేయనుంది. ఈ మేరకు అర్హులైన రైతుల వివరాలను రాష్ట్రం, జిల్లా, గ్రామాల వారీగా విడుదల చేసింది. తమ పేర భూములు ఉన్న రైతులు రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామాల వారీగా ఈ కింద ఉన్న లింక్ద్వారా వివరాలను తెలుసుకోవచ్చు.
https://pmkisan.gov.in/Rpt_BeneficiaryStatus_pub.aspx