సారథి న్యూస్, కర్నూలు: రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తోందని, ప్రతి సంక్షేమ కార్యక్రమ లబ్ధిని సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ జి.వీరపాండియన్ కోరారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటుచేసిన వైఎస్సార్ ఆసరా పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి మహిళకు ఇస్తున్న రుణాన్ని సద్వినియోగం చేసుకోకుండా పెట్టుబడిగా భావించి వ్యాపారం చేసుకోవాలన్నారు. నగరంలో మహిళా బజార్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌ను కోరారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ డీకే బాలాజీ, మెప్మా పీడీ శీరిష, జిల్లా సమాఖ్య సభ్యురాలు హేమలత, సమాఖ్య సభ్యులు మహేశ్వరి, అడిషనల్ కమిషనర్ రామలింగేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- September 14, 2020
- Archive
- కర్నూలు
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- COLLECTOR VEERAPANDIAN
- Kurnool
- MEPMA
- YSRASARA
- కర్నూలు
- కలెక్టర్ వీరపాండియన్
- మెప్మా
- వైఎస్సార్ఆసరా
- Comments Off on మహిళా సాధికారతకు పెద్దపీట