సారథి న్యూస్, కర్నూలు: దేశం కోసం త్యాగాలు చేసిన మహనీయుల స్ఫూర్తితో ముందుకెళ్లాలని కర్నూలు నగర పాలకసంస్థ కమిషనర్ డీకే బాలాజీ పిలుపునిచ్చారు. శనివారం స్థానిక నగర పాలకసంస్థ ఆఫీసులో పంద్రాగస్టు వేడుకలు ఘనంగా జరిగాయి. మొదట సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన కమిషనర్ బాలాజీ అనంతరం త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి సెల్యూట్ చేశారు. క్విట్ ఇండియా పోరాటం తరహాలో నేడు ప్రస్తుత కరోనా విపత్తు సమయంలోనూ పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలను ఫణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్నారని కొనియాడారు. అనంతరం వివిధ వార్డుల్లో కోవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా ఉత్తమ సేవలు అందించిన పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ ప్రశంసపత్రాలు అందజేశారు.
- August 15, 2020
- Archive
- కర్నూలు
- లోకల్ న్యూస్
- ANDRAPRADESH
- COVIND19
- Kurnool
- ఆంధ్రప్రదేశ్
- కమిషనర్
- కర్నూలు
- Comments Off on మహనీయుల త్యాగాలు మరువలేనివి