సారథి న్యూస్, చొప్పదండి: మథర్ థెరిస్సా సేవలు మరువలేనివని ప్రముఖ సామాజిక వేత్త, కవి, రచయిత పసూల రవి కుమార్ పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం దేశాయిపేట్ గ్రామంలో బుధవారం మథర్ థెరిస్సా జయంతి పురస్కరించుకుని గ్రామ యువకులు ‘మీకోసం.. మేము’ అనే స్వచ్ఛంద సేవాసమితిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత ఈ ఫౌండేషన్ స్థాపించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ గుంట రవి, ఉప సర్పంచ్ వెంకట్రామిరెడ్డి, వార్డుసభ్యులు మోర వెంకటరమణ, కొలిపాక మల్లేశం, ఫౌండర్స్ పాకాల మహేశ్‌గౌడ్, కల్లేపల్లి లక్ష్మణ్, సభ్యులు సురేశ్, అశోక్, నరేశ్, మహేశ్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
- August 26, 2020
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- KARIMNAGAR
- MOYHER THERISSA
- RAMADUGU
- SARPANCH
- YOUTH
- మధర్‌థెరిస్సా
- యూత్
- Comments Off on మథర్ థెరిస్సా గొప్ప మానవతావాది