Breaking News

మట్టి వినాయకులను పూజిద్దాం

మట్టివినాయకులను పూజిద్దాం

సారథి న్యూస్, మెదక్: పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ తమవంతు బాధ్యతగా కృషిచేయాలని, ఇళ్లు, మండపాల వద్ద మట్టితో తయారుచేసిన ప్రతిమలను ప్రతిష్టించాలని మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేష్ సూచించారు. మట్టితో తయారుచేసిన వినాయక ప్రతిమలను శుక్రవారం మెదక్ మున్సిపల్ ఆఫీసులో చైర్మన్ చంద్రపాల్ తో కలిసి పంపిణీ చేశారు. పర్యావరణాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. ఈ విషయాన్ని ప్రతిఒక్కరూ తమ బాధ్యతగా గుర్తించుకోవాలని సూచించారు. సామూహిక పూజలు, ప్రార్థనలు, ఊరేగింపుల వల్ల కరోనా వైరస్ మరింత వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని హెచ్చరించారు. నిమజ్జనానికి ప్రభుత్వపరంగా ఏర్పాట్లు చేసే పరిస్థితులు ప్రస్తుతం లేవని, రాబోయే రోజుల్లో వినాయక చవితితో పాటు అన్ని పండగలను అత్యంత వైభవంగా జరుపుకోవచ్చని అన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమాధికారి జగదీశ్, మున్సిపల్ కమిషనర్ శ్రీహరి, కౌన్సిలర్లు బట్టి లలిత, శ్రీనివాస్, ఆంజనేయులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.