సారథి న్యూస్, నెట్ వర్క్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తున్న రైతులకు మద్దతుగా రైతుసంఘాల పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన భారత్ బంద్ విజయవంతంగా కొనసాగింది. జోగుళాంబ జిల్లా ఉండవల్లి మండలంలోని అలంపూర్ చౌరస్తా సమీపంలోని హైదరాబాద్– బెంగళూర్ హైవే పుల్లూర్ టోల్ ప్లాజా వద్ద రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి రైతులతో కలిసి నిరసన చేపట్టారు. రాష్ట్ర కన్స్యూమర్ ఫోరం చైర్మన్ తిమ్మప్ప, జడ్పీ చైర్పర్సన్ సరితా తిరుపతయ్య, ఎమ్మెల్యే డాక్టర్ వీఎం అబ్రహం, ఉండవెల్లి ఎంపీపీ బిసమ్మ తదితరులు పాల్గొన్నారు. ములుగు జిల్లా వాజేడు మండలం కేంద్రంలో జడ్పీటీసీ, ఎంపీపీల ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. అలాగే మెదక్ జిల్లా తూప్రాన్ వద్ద 44వ నంబర్ హైవేపై రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి టి.హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ హేమలత, అటవీ అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి తదితరులు నిరసన చేపట్టారు. అలాగే మెదక్ పట్టణంలో టీఆర్ఎస్, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, యూత్ కాంగ్రెస్ నాయకులు వేర్వేరుగా ఆందోళనలు నిర్వహించారు. ప్రధాని నరేంద్రమోడీ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ బూర్గుల టోల్ గేట్ వద్ద మంత్రి కె.తారక రామారావు ప్లకార్డులు పట్టుకుని నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్, రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు, షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. హైదరాబాద్ లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, వరంగల్ –హన్మకొండ హైవేపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, పెద్దపల్లి జిల్లా ధర్మారం. జగిత్యాల జిల్లా లో సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, కామారెడ్డి శివారులోని ఎల్లారెడ్డి పరిధిలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రైతు వ్యతిరేక చట్టాలను వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు.
- December 8, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- AGRICULTURE ACT
- BARATHBANDH
- CM KCR
- MINISTER KTR
- PM MODI
- కేటీఆర్
- ప్రధాని మోడీ
- భారత్‌బంద్
- వ్యవసాయ చట్టాలు
- సీఎం కేసీఆర్
- Comments Off on భారత్ బంద్ సక్సెస్