Breaking News

బైండ్ల కులస్తులకు నామినేటెడ్ పదవులు ఇవ్వాలి

బైండ్ల కులస్తులకు నామినేటెడ్ పదవులు ఇవ్వాలి

సారథి న్యూస్​, ఎల్బీనగర్(రంగారెడ్డి): బైండ్ల కులస్తుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషిచేయాలని, తాను కులస్తుల విద్య, ఉపాధి, సమగ్ర అభివృద్ధికి నిరంతరం శ్రమించి పనిచేస్తానని తెలంగాణ బైండ్ల(భవనీయ)సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏదుల్ల గౌరీశంకర్ అన్నారు. తెలంగాణ బైండ్ల కులస్తుల రాష్ట్రస్థాయి సమావేశం హయత్ నగర్ లోని బొమ్మిడి నాగిరెడ్డి గార్డెన్స్ లో కడియం రామచంద్రయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ ఉపకులాల్లో అత్యధిక జనాభా కలిగిన బైండ్ల కులస్తులు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని అన్నారు. చాలా మంది గ్రామదేవతల పూజా విధానమే వృత్తిగా జీవిస్తున్నారని, పౌరోహిత్యంలో శిక్షణనిచ్చి పూజారులుగా నియమించాలని కోరారు. అనేకమంది జానపద కళాకారులుగా ఉన్నారని, గుర్తింపు కార్డులు ఇచ్చి పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్​ చేశారు. అర్హులందరికీ మూడెకరాల భూమి, డబుల్​ బెడ్​రూమ్​ ఇల్లు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, నామినేటెడ్ పదవుల్లో తమ వాటా కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల, నియోజకవర్గ, మండల కమిటీల నియామకం చేపడతామని, కులస్తులందరినీ ఐక్యం చేస్తామన్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో చర్చించి ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. సమావేశానికి రాష్ట్ర నలుమూలల నుంచి పెద్దసంఖ్యలో కులసంఘం పెద్దలు హాజరయ్యారు. అనంతరం నూతన రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో తెలంగాణ బైండ్ల (భవనీయ)సంఘం రాష్ట్ర అడ్​హక్ కమిటీ సభ్యులు ప్రొఫెసర్​ చింతల యాదయ్య, యాదగిరిరావు, కడియం ధనుంజయ్, ఇంద్రపల్లి వెంకటేశం, ఏర్పుల భాస్కర్, ఏర్పుల గాలయ్య, గంగుల శ్రీనివాస్, ముప్పాల సుధాకర్, పులి యాదగిరి, తగరం సత్యనారాయణ, ఇంద్రపల్లి సంజీవ, వెంకట్, రవీందర్, రామకృష్ణ పాల్గొన్నారు.

గౌరీశంకర్, బైండ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు