సారథి న్యూస్, రామగుండం: గ్రామాల్లో ఎవరైనా బెల్ట్‌షాపులు ఏర్పాటుచేసి అక్రమంగా మద్యం విక్రయిస్తే కఠినచర్యలు తీసుకుంటామని రామగుండం సీపీ సత్యనారాయణ హెచ్చరించారు. గురువారం పాలకుర్తి మండలం తక్కళ్లపల్లి గ్రామంలో పోలీసులు, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది తనిఖీలు చేపట్టి ఓ ఇంట్లో నిలువ ఉంచిన రూ.31,405 విలువైన మద్యాన్ని సీజ్‌చేశారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో రెండు రోజులుగా బెల్టుషాపులపై దాడులు కొనసాగుతున్నాయి. తనిఖీల్లో టాస్క్ ఫోర్స్ సీఐ రాజ్ కుమార్, ఎస్సై షేక్ మస్తాన్, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది శేఖర్, మహేందర్, సునీల్, సదయ్య తదితరులు పాల్గొన్నారు.
- July 30, 2020
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- BELTSHOPS
- LIQUOR
- WINE
- బెల్ట్‌షాపులు
- రామగుండం
- Comments Off on బెల్ట్‌షాపులు నడిపితే తాటతీస్తాం