ముంబై: దేశవ్యాప్తంగా ఉన్న కాలేజీలు, యూనివర్సిటీల్లో ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ నిర్వహించాలనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని సవాలు చేస్తూ మహారాష్ట్ర మినిస్టర్ ఆదిత్యథాక్రే సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కు సెప్టెంబర్లో నిర్వహించనున్న పరీక్షలను రద్దుచేసేలా ఆదేశించాలని శివసేన అనుబంధ సంస్థ యువ సేన తరఫున పిటిషన్ వేశారు. స్టూడెంట్స్ ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, యాంక్సైటీ, సేఫ్టీని పక్కన పెడుతోందని, అందుకే పరీక్షలు నిర్వహిచాలని చూస్తోందని పిటిషన్లో పేర్కొన్నారు.
‘కరోనా నేషనల్ డిజాస్టర్. దాన్ని దృష్టిలో పెట్టుకుని యూజీసీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ పరీక్షలు క్యాన్సిల్ చేయాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితి యూజీసీకి బహుశా అర్థం అయి ఉండదు’ అని యువసేన స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్స్ ఐఐటీలే పరీక్షలు క్యాన్సిల్ చేశాయని గుర్తుచేశారు. ఇన్విజిలేటర్లు, స్టూడెంట్స్ ఎగ్జామ్ సెంటర్లకు చేరుకునేందుకు ఇబ్బందులు పడతారని ఆదిత్యథాక్రే అన్నారు. ఈ విషయమై ఆదిత్య థాక్రే కూడా కేంద్రంపై గతంలో కూడా విమర్శలు చేశారు.