ప్రభాస్ సినిమా అంటేనే ఓ క్రేజీ. సినిమా అనౌన్స్మెంట్ అయిన దగ్గరి నుంచి హీరోయిన్ ఎవరు? విలన్ ఎవరు? మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? అన్న క్రేజీ డౌట్స్ ఎక్కువ అయిపోతుంటాయి ఫ్యాన్స్ కు. ప్రస్తుతం రాధాకృష్ణ డైరెక్షన్లో ‘రాధేశ్యామ్’ చేస్తున్న ప్రభాస్ నాగ్ అశ్విన్ డైరెక్షన్, బాలీవుడ్ డైరెక్షర్ ఓంరౌత్ డైరెక్షన్లో రెండు సినిమాలకు కమిట్ మెంట్ ఇచ్చాడు. ఒకటి మైథలాజికల్ మూవీ అయితే నాగ్ అశ్విన్ మాత్రం ప్రభాస్ కోసం సైన్స్ ఫిక్షన్ జానర్‌ను ఎన్నుకున్నాడు. ఈ మూవీలో ప్రభాస్ డ్యూయల్ రోల్ అని కూడా అంటున్నారు. దీపికా పదుకునే హీరోయిన్ అన్న వార్తతో ఈ ప్రాజెక్టుకు మరింత హైప్ వచ్చింది. అయితే ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్‌ను అనౌన్స్ చేసి మరింత ఆశ్చర్యానికి గురిచేశారు.
తెలుగు ఇండస్ట్రీలో అప్పట్లో వైవిధ్యానికి కేరాఫ్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ఈ సినిమాకు క్రియేటివ్ హెడ్ గా పనిచేస్తున్నారు. ఈ విషయాన్ని వైజయంతీ మూవీస్ అధికారికంగా తెలుపుతూ ‘మేము ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కల చివరికి నెరవేరనుంది. సింగీతం శ్రీనివాసరావు గారిని మా ఎపిక్ చిత్రానికి స్వాగతిస్తున్నందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాం. ఆయన సృజనాత్మక, సూపర్ పవర్స్ కచ్చితంగా మాకు మార్గదర్శకంగా ఉంటాయి’ అని పోస్ట్ చేశారు. ఇప్పటి జనరేషన్ కూడా సింగీతం శ్రీనివాసరావు తీసిన అప్పటి సినిమాలను బాగా ఇష్టపడతారు.
ముఖ్యంగా ‘పుష్పక విమానం, ఆదిత్య 369, అపూర్వ సోదరులు’ లాంటి చిత్రాలు ఇప్పటికీ మరువలేనివి. ట్రెండ్ కు తగినట్టుగా ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని అందించే సింగీతం శ్రీనివాసరావు ప్రభాస్ సినిమాకు పనిచేయడం నిజంగా విశేషమే. ఇక ఈ సినిమా అన్ని ప్రధాన భాషల్లో విడుదల కానుంది. కాగా, నాగ్ అశ్విన్ ఓ పురాణ కథలోని పాత్రల ఆధారంగా.. నేటి సమాజానికి తగ్గట్లు కథ రాసుకున్నట్లు.. ప్రభాస్ రెండు పాత్రల్లో కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియా మూవీగా అశ్వినీదత్ నిర్మించనున్నారు.