న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ మరో అరుదైన రికార్డును సాధించారు. అత్యధిక కాలం పదవిలో ఉన్న కాంగ్రెసేతర ప్రధానిగా ఆయన ఖ్యాతిని గడించారు. వాజపేయి కాంగ్రెసేతర ప్రధానిగా 2,268 రోజులు కొనసాగారు. కాగా, గురువారంతో ప్రధాని మోడీ ఆ రికార్డును అధిగమించారు. ఈ మేరకు బీజేపీ సోషల్మీడియా జాతీయవిభాగం ఇంచార్జి ప్రీతీ గాంధీ ట్వీట్ చేశారు. ఇక సుదీర్ఘకాలం పదవిలో ఉన్న వారిలో మోదీ నాలుగో స్థానానికి చేరారు. తొలి మూడు స్థానాల్లో జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, డాక్టర్ మన్మోహన్ సింగ్ ఉన్నారు. నెహ్రూ 16ఏళ్ల పాటు, ఇందిర 15ఏళ్ల పాటు, మన్మోహన్ పదేళ్ల పాటు ప్రధానులుగా పనిచేశారు.
- August 14, 2020
- Archive
- Top News
- జాతీయం
- DELHI
- IIDIRA
- MODI
- NEHRU
- PRIMEMINISTER
- RECORD
- ఇందిరాగాంధీ
- కొత్తరికార్డు
- ప్రధాని మోడీ
- Comments Off on ప్రధాని మోడీ మరో రికార్డు