సారథిమీడియా, హైదరాబాద్: దళితయువతిపై 139 మంది లైంగికదాడి కేసు రోజుకో మలుపుతిరుగుతున్నది. తాజాగా ఈ వివాదంపై ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ స్పందించారు. ఈ కేసుతో యాంకర్ ప్రదీప్‌కు ఎటువంటి సంబంధం లేదని మందకృష్ణ పేర్కొన్నారు. సోమవారం ఆయన సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో బాధిత యువతితోకలిసి మీడియా సమావేశం నిర్వహించారు. మందకృష్ణ ఏమన్నారో ఆయన మాటల్లోనే.. ‘యాంకర్ ప్రదీప్ మాచిరాజుకు ఈ కేసుతో సంబంధం లేదు. డాలర్ బాబు ఒత్తిడి వల్లే ప్రదీప్‌పై బాధితురాలు కేసు పెట్టారు. మేము సీసీఎస్ పోలీసులను కలుసుకొని పలు వివరాలు సేకరించాం. నేను నిన్న సుమారు రెండుగంటలపాటు బాధితురాలితో మాట్లాడాను. బాధిత యువతి తన పెళ్లైన తర్వాత జరిగిన ఘటనలన్నీ నాకు క్షణ్ణంగా చెప్పింది. ఆమె ఫిర్యాదు చేసిన వ్యక్తుల్లో దాదాపు 30 శాతం మంది లైంగకదాడికి పాల్పడ్డారు. మరో 30 శాతం మంది యువతిని బ్లాక్మెయిల్ చేశారు. అయితే డాలర్ బాబు ఒత్తిడితో సదరు యువతి 40 శాతం అమాయకుల పేర్లు చెప్పింది. ఎస్ఎఫ్ఐకి చెందిన మీసాల సుమన్ వల్లే ఈ అమ్మాయి జీవితం నాశనం అయ్యింది. మీసాల సుమన్, డాలర్ బాబును విచారిస్తే నిజాలు బయట పడుతాయి’ అని మందకృష్ణ పేర్కొన్నారు.
- August 31, 2020
- Archive
- Top News
- హైదరాబాద్
- ANCHOR
- DOLLERBABU
- HYDERABAD
- MANDAKRISHNA
- PRADEEP
- PRESSMEET
- డాలర్బాబు
- డ్రామా
- మందకృష్ణ
- Comments Off on ప్రదీప్ నిర్దోషి.. అదంతా డాలర్బాబు డ్రామా!