- లక్ష తులసి దళాలతో అర్చన
- జ్యోతివాస్తు విద్యాపీఠం పుష్కర పూజలు
సారథి న్యూస్, మానవపాడు: తుంగభద్ర నది పుష్కర మహోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం పుల్లూరు గ్రామంలోని చెన్నకేశవస్వామి ఆలయ ఆవరణలో పీఠాధిపతి జ్యోతి వాస్తు విద్యాపీఠం సిద్ధాంత భాస్కర మహేశ్వరశర్మ ఆధ్వర్యంలో బాసర సరస్వతి అమ్మవారికి లక్ష తులసి దళాల అర్చన కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. మొదట పుష్కర ఘాట్ లో సరస్వతి దేవి విగ్రహానికి అభిషేకం నిర్వహించారు. మహిళలు ప్రత్యేకపూజలు చేశారు. అనంతరం చెన్నకేశవ స్వామి ఆలయ ప్రాంగణంలో లక్ష తులసి దళాలతో అర్చనలు చేశారు.
ఘాట్లలో భక్తుల రద్దీ
ఏకాదశి సందర్భంగా ఒకేరోజు సుమారు 6,500 మంది పుష్కర స్నానం చేయడంతో ఘాట్ భక్తులతో పులకించిపోయింది. ఉత్తర మహోత్సవం సందర్భంగా జరుగుతున్న పూజా కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యేలు చల్లా వెంకట్రామిరెడ్డి, ఎస్.సంపత్ కుమార్ హాజరై ఆలయాల్లో ప్రత్యేకపూజలు చేశారు.