సారథి న్యూస్, మెదక్: పల్లెలను నందనవనాలుగా తీర్చదిద్దాలని మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి సూచించారు. శుక్రవారం సాయంత్రం జిల్లా అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సెగిగ్రేషన్ పనులను త్వరగా పూర్తిచేయడంతో పాటు గ్రామాల్లో ప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్తవేస్తే చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి శుక్రవారాన్ని డ్రై డేగా పాటించాలని ఆదేశించారు. నాటిన మొక్కలను ట్రీగార్డులను ఏర్పాటు చేయాలన్నారు. మెదక్ జిల్లాను ఓడీఎఫ్ ప్లస్ జిల్లాగా మార్చేందుకు ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. విద్యుత్ పొదుపు పాటించేందుకు అవసరమైన చోట ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేయడంతో పాటు అవసరం లేని చోట్ల, పని చేయని బోర్ల కనెక్షన్లను తొలగించడం, కెపాసిటర్లు ఏర్పాటు చేయడం ద్వారా కరెంట్ బిల్లులు తగ్గేలా చర్యలు తీసుకోవాలన్నారు. రైతు వేదికల నిర్మాణాలను కంప్లీట్ చేయాలన్నారు. కార్యక్రమంలో డీఆర్డీవో శ్రీనివాస్ పాల్గొన్నారు.
- July 24, 2020
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- FRIDAY DRYDAY
- HARITHAHARAM
- medak
- మెదక్
- సెగిగ్రేషన్
- హరితహారం
- Comments Off on పల్లెలను నందనవనాలుగా తీర్చిదిద్దాలి