మహేశ్‌బాబు మేనల్లుడిగా కంటే విలక్షణమైన హీరోగానే గుర్తింపు తెచ్చుకోడానికి ఇష్టపడే సుధీర్ బాబు లేటెస్ట్గా ఓ సినిమాకి కమిట్మెంట్ఇచ్చాడట. అదీ తన బెస్ట్ ఫ్రెండ్ అయిన విజయ్ చిల్లా ప్రొడక్షన్లో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించాడు సుధీర్ బాబు. ‘ప్రేమ కథా చిత్రమ్, కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ, భలే మంచి రోజు, భాగీ, శమంతకమణి, సమ్మోహనం’ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాడు. ప్రస్తుతం సుధీర్ బాబు.. నానితో కలిసి నటించిన ‘వి’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. లాక్ డౌన్ సమయంలో ఫిట్ నెస్‌పై ఫోకస్ పెట్టాడు సుధీర్.
కాగా, సుధీర్ బెస్ట్ ఫ్రెండ్ అయిన విజయ్ చిల్లా ఇంతకుముందు 70ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ‘భలే మంచి రోజు’ ‘ఆనందో బ్రహ్మ’ ‘యాత్ర’ సినిమాలను నిర్మించాడు. తాజాగా సుధీర్ విజయను పరిచయం చేస్తూ ‘నేను విజయ్ కలిసి పెరిగాం.. మా ఇద్దరి ఇంటరెస్ట్‌లు ఒకేలా ఉంటాయి.. కానీ ఇలా సినిమాల్లోకి వస్తాం’ అని ఎప్పుడూ అనుకోలేదు. నేను నటించిన ‘భలే మంచి రోజు’ సినిమాను విజయ్ నిర్మించారు. ఇప్పుడు మళ్లీ ఓ కొత్త ప్రాజెక్ట్ అనుకుంటున్నాం.. తనను కలిసేందుకు పరిస్థితులు అనుకూలించకపోయినా నేనూ నా యార్.. కొత్త సూపర్ స్టార్‌తో టెక్నాలజీ ద్వారా మా టైమ్‌ను స్పెండ్ చేస్తున్నాం..’ అంటూ మెక్‌డొనాల్డ్ ఆల్కహాల్ బాటిల్ తో సహా ఉన్న విజయ్‌తో వీడియో కాల్ మాట్లడుతున్న స్క్రీన్ షాట్ ఒకటి పోస్ట్ చేశారు హీరో సుధీర్ బాబు.
కాగా, సుధీర్ బాబు మూవీ ప్రమోషన్స్ తో పాటు ఇలా ఇన్‌డైరెక్ట్‌గా మెక్ డొనాల్డ్స్ బ్రాండ్ కు పెయిడ్ ప్రమోషన్స్ చేస్తున్నట్లున్నారనే డౌట్ కూడా కలుగుతోంది. సోషల్ మీడియా వేదికగా చాలామంది సెలబ్రిటీలు పెయిడ్ ప్రమోషన్స్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సుధీర్ కూడా తన మూవీకి పబ్లిసిటీ చేసుకోవడంతో పాటు బ్రాండ్ ప్రమోషన్ కూడా చేస్తున్నారని అర్థమవుతోంది. అయితే కొంతమంది ఫ్యాన్స్ మాత్రం డ్రింక్ చేస్తూ బాడీ ఎలా మెయింటెనెస్చేస్తున్నాడా? అని ఆశ్చర్యపోతున్నారు.