సారథిన్యూస్, వంగూర్: విధుల్లో నిర్లక్ష్యం వహించిన పంచాయతీ కార్యదర్శి సస్పెండ్ అయ్యారు. నాగర్కర్నూల్ జిల్లా వంగూర్ గ్రామపంచాయతీ కార్యదర్శి రాజుగౌడ్ విధుల్లో నిర్లక్ష్యం వహించారు. విధులకు సరిగ్గా హాజరుకావడం లేదని.. ప్రజలను పట్టించుకోవడం లేదని అతడిపై ఫిర్యాదులు అందాయి. దీంతో విచారణ చేపట్టిన కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా.. కార్యదర్శిని సస్పెండ్ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. వీరితోపాటు గ్రామ సర్పంచ్, ఉప సర్పంచులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.
- July 15, 2020
- Archive
- మహబూబ్నగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- COLLECTOR
- SARATHI
- SUSPEND
- VANGUR
- నాగర్కర్నూల్
- వంగూర్
- Comments Off on నిర్లక్ష్యం వహిస్తే అంతేమరి