సారథి న్యూస్, ములుగు: ఓ నిరుపేద యువతికి మహిళా అధికారి సాయం అందించారు. తిండిలేక అల్లాడిపోతున్న యువతి మంగళవారం ములుగు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు వచ్చింది. ఆమె పరిస్థితిని చూసి చలించిపోయిన సబ్‌రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ రూ.మూడువేలు, 25కేజీల బియ్యం అందజేశారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండల కేంద్రానికి చెందిన మురారి సుధాకర్, స్వరూప దంపతులకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. తల్లి నాలుగేళ్ల క్రితం చనిపోవడంతో వారి కుటుంబ పోషణ భారంగా మారింది. తండ్రి పిల్లలను పట్టించుకోకపోవడంతో కష్టాలు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో సబ్‌రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ వారిని ఆదుకునేందుకు ముందుకొచ్చారు. ఏ కష్టం వచ్చిన ఫోన్ చేయమని చెప్పి భరోసా ఇచ్చారు. ఆమె వెంట సర్వర్ ఫౌండేషన్ సభ్యులు మామిడి పెల్లి రమేష్, చంటి సామ్యూల్ ఉన్నారు.
- October 13, 2020
- Archive
- లోకల్ న్యూస్
- వరంగల్
- షార్ట్ న్యూస్
- MULUGU
- SARVOR FOUNDATION
- VAJEDU
- ములుగు
- వాజేడు
- సర్వర్ ఫౌండేషన్
- Comments Off on నిరుపేద యువతికి సాయం