సారథి న్యూస్, మెదక్: మెదక్ జిల్లాలోని వనదుర్గా ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఇటీవల మంజీరా నది పరీవాహక ప్రాంతంలో కురిసిన వర్షాలకు ఎగువ నుంచి వరద వచ్చి ఆనకట్టలోకి పూర్తిస్థాయిలో నీరు చేరింది. 0.2 టీఎంసీల సామర్థ్యం కలిగిన ఆనకట్ట పూర్తిగా నిండింది. ఘనపూర్ ఆనకట్ట కింద కొల్చారం, మెదక్, హవేలీ ఘనపూర్, పాపన్నపేట మండలాల్లో 21,625 ఎకరాల ఆయకట్టు ఉంది. ఆనకట్ట పూర్తిస్థాయిలో నిండడంతో మహబూబ్నహర్, ఫతేనహర్కాల్వల ద్వారా ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేసే అవకాశం ఉంది. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.