తెలుగు సినీ దర్శకుడు తేజకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇటీవల ఆయన కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ కరోనా పరీక్షలు చేయించుకున్నారు. దీంతో కరోనా ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం ఆయన ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకుంటున్నారు. ఇటీవల తనను కలిసిన వారంతా వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని.. క్వారంటైన్లో ఉండాలని ఆయన సూచించారు. తేజ నెల క్రితం కరోనాపట్ల జాగ్రత్తగా ఉంటాలంటూ ఓ వీడియోను విడుదల చేశాడు. భారతీయుల అటిట్యూడ్ వల్ల కరోనా కేసుల సంఖ్య మనదేశంలో కోటికి పెరిగినా ఆశ్చర్యం లేదని.. మనకు నిర్లక్ష్యం ఎక్కువగా ఉందని ఆయన ఆ వీడియోలో పేరొన్నారు. త్వరలోనే భారత్‌లో లక్షల్లో కేసులు నమోదవుతాయని ఆయన పేర్కొన్నారు. అన్ని జాగ్రత్తలు చెప్పిన తేజకు ఇప్పడు కరోనా వచ్చింది. అయితే ప్రస్తుతం ఆ వీడియో సామాజికమాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. తేజ వెంటనే కరోనా నుంచి కోలుకోవాలని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్ట్ చేస్తున్నారు ఆయన అభిమానులు.
- August 3, 2020
- Archive
- Top News
- సినిమా
- CARONA
- DIRECTOR
- TEJA
- TODAY
- కరోనా
- సినీ దర్శకుడు
- Comments Off on దర్శకుడు తేజకు కరోనా