సారథి న్యూస్, అలంపూర్ (జోగుళాంబ గద్వాల): ఈనెల 20వ తేదీ నుంచి జరిగే తుంగభద్ర నది పుష్కరాల నేపథ్యంలో ఎస్పీ జె.రంజన్ రతన్ కుమార్ సోమవారం అలంపూర్ లోని పుష్కర ఘాట్ ను, జోగుళాంబ ఆలయాల సముదాయాన్ని సందర్శించారు. పుష్కర ఘాట్ ప్రాంతంలో వీఐపీ పార్కింగ్, సాధారణ భక్తుల వాహనాలకు పార్కింగ్, అలాగే వృద్ధులు, దివ్యాంగులకు కల్పించే ఉచిత పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించారు. అమ్మవారి ఆలయం, స్వామివారి ఆలయంలోకి వచ్చే మార్గాలు, బయటకు వెళ్లే మార్గాలను గుర్తించి బారికేడ్లు ఏర్పాటు చేయాలని స్థానిక అధికారులను ఆదేశించారు. ఎస్పీ వెంట డీఎస్పీ యాదగిరి, అలంపుర్ సీఐ వెంకటేశ్వరయ్య, ఎస్బీ ఇన్స్పెక్టర్రాజేందర్ రెడ్డి, అలంపూర్ ఎస్సై మధుసూదన్ రెడ్డి, దేవాదాయశాఖ అధికారులు, ముఖ్య అర్చకుడు ఆనంద్ శర్మ ఇతర అధికారులు పాల్గొన్నారు.
- November 9, 2020
- Archive
- Top News
- మహబూబ్నగర్
- ముఖ్యమైన వార్తలు
- లోకల్ న్యూస్
- JOGULAMBA GADWALA
- SP RANJANRATHAN
- TUNGABADRA PUSHKARALU
- అలంపూర్
- ఎస్పీ రంజన్రతన్
- జోగుళాంబ గద్వాల
- తుంగభద్ర
- పుష్కరఘాట్
- Comments Off on తుంగభద్ర పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు