Breaking News

తిరుపతి లడ్డూ కావాలా?

  • సగం ధరకే శ్రీవారి ప్రసాదం

సారథి న్యూస్​, తిరుపతి: తిరుమ‌ల శ్రీ‌వారి ల‌డ్డూ ప్రసాదం మే 25 నుంచి రాష్ట్రంలోని 13జిల్లా కేంద్రాల్లోని టీటీడీ క‌ల్యాణ‌ మండ‌పాల్లో అందుబాటులో ఉంచనుంది. లాక్​ డౌన్​ ముగిసి తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులకు దర్శనానికి అనుమతించే వరకు సగం ధరకే స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని అందించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు చిన్న లడ్డూను రూ.50 నుంచి రూ.25కు తగ్గించారు. ల‌డ్డూ ప్రసాదం స‌మాచారం కోసం టీటీడీ కాల్​ సెంటర్​ టోల్‌ఫ్రీ నంబ‌ర్లు : 18004254141 లేదా 1800425333333 సంప్రదించవచ్చని పేర్కొన్నారు.

వెయ్యికి పైగా లడ్డూలు కొనుగోలు చేయాలనుకునే భక్తులు తమ పేరు, చిరునామా, పూర్తి వివరాలను ఐదు రోజులకు ముందుగా [email protected] అనే మెయిల్ పంపించాలని టీటీడీ సూచించింది. లడ్డూలు పొందడానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ మెయిల్ ద్వారా సంబంధిత భక్తులకు తెలియజేస్తామని పేర్కొంది. టీటీడీ కల్యాణ మండపాలు, లడ్డూ కౌంటర్​ కేంద్రాలకు వచ్చే భక్తులు తప్పనిసరిగా మాస్క్​ కట్టుకుని రావాలని సూచించింది.